అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి పెమా ఖాండూ తన కుటుంబ సభ్యులు, బంధువులకు అక్రమంగా ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సోమవారం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి పెమా ఖాండూ తన కుటుంబ సభ్యులు, బంధువులకు అక్రమంగా ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సోమవారం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సుమారు రూ.1,270 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను ఆయన తన కుటుంబసభ్యులు, బంధువులకు అప్పనంగా అప్పగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సేవ్ మాన్ రీజియన్ ఫెడరేషన్, వలంటరీ అరుణాచల్ సేనలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేయాలని కోరాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.
