ప్రతిభను పెంపోందించేందుకు అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంతో పోచారం పరిధిలోని అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని జనగామా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

యునివర్సిటీలో సినర్జి 2026 వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ యునివర్సిటీ అభివృద్ధి అంచెలంచెలుగా కృషి చేస్తూనే, విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు .దీంతో అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులు విద్యతోపాటు, క్రీడలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ పట్ల అత్యంత ప్రతిభను కనబరుస్తున్నారని చెప్పారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అర్చనా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ నాయకులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు
