మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సుర్వే అదృశ్యమయ్యారు. ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా ఇస్లాం నుంచి తిరిగి హిందూ మతంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే ఈ ఘటన జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది.

తమ కుమార్తెను అత్తింటి వారే కిడ్నాప్ చేశారంటూ సయాలీ సుర్వే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పింప్రి-చించ్వాడ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచా
