విద్యార్థులకు శారీరక, మానసికోల్లాసం కలిగించడంతోపాటు క్రీడల ప్రాముఖ్యత తెలియజేసేందుకు కరీంనగర్ బల్దియా ఏటా వేసవిలో ఉచిత సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తున్నది.

కొత్తపల్లి, జూన్ 3: విద్యార్థులకు శారీరక, మానసికోల్లాసం కలిగించడంతోపాటు క్రీడల ప్రాముఖ్యత తెలియజేసేందుకు కరీంనగర్ బల్దియా ఏటా వేసవిలో ఉచిత సమ్మర్ క్యాంప్లు నిర్వహిస్తున్నది. జిల్లా యువజన, క్రీడాశాఖ సహకారంతో 2017 నుంచి ప్రతి సంవత్సరం నెలపాటు సుమారు వెయ్యి నుంచి 1,500 మంది విద్యార్థులకు పలు క్రీడాంశాల్లో శిక్షణ అందిస్తున్నది. ప్రతిరోజూ కోడిగుడ్డు, పాలు, అరటి పండ్లతోపాటు శిక్షణలకు అవసరమయ్యే క్రీడా సామగ్రికి సైతం ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లిస్తున్నది.
