రామంతాపూర్ పెద్దచెరువులో పేదల గుడిసెలను హైడ్రా కూల్చివేసింది. చెరువు చుట్టూ పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించుకున్న వారి జోలికి వెళ్లకుండా కేవలం గుడిసెవాసులనే తొలగించడంతో స్థానికంగా అధికారుల తీరును తప్పుబట్టారు.

రామంతాపూర్, జూలై 7: రామంతాపూర్ పెద్దచెరువులో పేదల గుడిసెలను హైడ్రా కూల్చివేసింది. చెరువు చుట్టూ పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించుకున్న వారి జోలికి వెళ్లకుండా కేవలం గుడిసెవాసులనే తొలగించడంతో స్థానికంగా అధికారుల తీరును తప్పుబట్టారు. పెద్దలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయమా? అని చర్చించుకుంటున్నారు. తమకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాకనే గుడిసెలు తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారని, ఇప్పడేమో తర్వాత ఇస్తామని చెప్పడం ఎంత వరకు న్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
