మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి అంత్యక్రియను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి అంత్యక్రియను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదేశాలు జారీ చేసింది. కుటుంబసభ్యులతో సంప్రదించి, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సూచించింది. అంత్యక్రియల తేదీ, సమయం, వేదిక ఖరారు చేసుకుని, అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపింది.
