హరీశ్ రావు జన్మదిన సందర్భంగా జహీరాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు పాదయాత్ర చేపట్టారు.

జహీరాబాద్, జూన్ 3 : తమ అభిమాన ప్రజా నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు జన్మదిన సందర్భంగా జహీరాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు పాదయాత్ర చేపట్టారు. బుధవారం సంకటహర చతుర్ధిని పురస్కరించుకొని హరీశ్ రావు నిండు నూరేళ్లు ఆయురా రోగ్యాలతో ఉండాలని జహీరాబాద్ పట్టణంలోని భవాని మందిరం నుండి న్యాల్కల్ మండలం రేజింతల్ సిద్ధి వినాయక స్వామి వారి సన్నిధికి మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.
