ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలపై, కేంద్ర ప్రభుత్వం, చమురు కంపెనీలు మరో భారీ భారాన్ని మోపాయి.

ఈ ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటివరకు రూ.913 గా ఉన్న 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర, ఇప్పుడు ఏకంగా రూ.942 కి చేరుకుంది. పెరిగిన ఈ కొత్త ధరలు జూన్ 7వ తేదీ నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, రాష్ట్రాల్లోనూ ఈ ధరల పెరుగుదల స్థానిక పన్నులను బట్టి వర్తించనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గులు, దిగుమతి వ్యయం పెరగడం వల్లే ఈ ధరలను సవరించాల్సి వచ్చిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
