ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

హైదరాబాద్ : ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడటంతో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మందమర్రికి చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి.
