
దాతునగర్లో ఘనంగా హిందూ సమ్మేళనం
(శ్రీరామ్ చక్రి న్యూస్):6/6/2026: మీర్పేట్ నగర్లోని ఎస్వైఆర్ ఫంక్షన్ హాల్లో దాతునగర్ బస్తీ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూజ్య శ్రీ శ్రీ శాంతానంద సరస్వతి, వెంకట్ నివాస్, కళ్లెం స్వప్న ముఖ్య అతిథులుగా హాజరై సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, శ్రీరాముని ఆదర్శాలపై ప్రసంగించారు. హిందూ సమాజ ఐక్యత, సంస్కృతి పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో యువత, మహిళలు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాజ శ్రేయస్సు, ధార్మిక విలువల పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడంపై నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.
