పండించిన పత్తిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మద్దతు ధర చెల్లించకుండా.. కొనుగోళ్లు చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు.

పెద్దపల్లి : ఆరుగాలం శ్రమించి పండించిన పత్తిని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. మద్దతు ధర చెల్లించకుండా.. కొనుగోళ్లు చేయకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏనాడూ రైతులకు నష్టం చేయలేదన్నారు. కానీ, ఇప్పుడు పత్తిని అమ్ముకునేందుకు రైతు ఇబ్బందులు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు
