ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్మామడ టోల్ ప్లాజాకు 10.30 గంటలకు చేరుకోగానే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్మామడ టోల్ ప్లాజాకు 10.30 గంటలకు చేరుకోగానే ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి పుష్పగుచ్ఛ అం దించి స్వాగతించారు. బాణసంచా కాల్చారు. నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. అ క్కడి నుంచి భారీ కాన్వాయ్ మధ్య ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వెళ్లారు. అక్కడ రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ బయలుదేరారు. సోన్ మండలంలోని గంజాల్ టోల్‌ప్లాజా వద్ద నాయకులు స్వాగతం పలికారు. సాయం త్రం భైంసా పట్టణంలోని గాంధీగంజ్‌లో రైతులతో మాట్లాడారు.
