రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లో గురువారం ఓ నాగుపాము హడలెత్తించింది. కార్యాలయంలోని శానిటేషన్ విభాగం పక్కన భారీ పొడవాటి విష సర్పం కలియతిరిగింది. శానిటేషన్ విభాగం కిటికీలో నుంచి లోపలికి దూరెందుకు ప్రయత్నించింది

కోల్ సిటీ, మే 7: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం లో గురువారం ఓ నాగుపాము హడలెత్తించింది. కార్యాలయంలోని శానిటేషన్ విభాగం పక్కన భారీ పొడవాటి విష సర్పం కలియతిరిగింది. శానిటేషన్ విభాగం కిటికీలో నుంచి లోపలికి దూరెందుకు ప్రయత్నించింది. సిబ్బంది కదలికలు ఉండడంతో కొద్దిసేపు అటు ఇటు తిరిగి వెనకాల నిరుపయోగంగా ఉన్న ఇనుప పైపుల కుప్పలోకి వెళ్లింది. ఇదిలా ఉండగా కార్యాలయం వెనకాల చెట్లపొదలు, స్క్రాప్, నిరుపయోగంగా మూలకుపడ్డ వాహనాలు ఉండటంతో పాములు, తేళ్లు, ఇతర విష కీటకాలకు ఆవాసంగా మారింది.
