ఎలాంటి ముందుస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారంటూ బాధితులు, అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. రహదారి విస్తరణతో ఇండ్లు కోల్పోయి తాము వీధిన పడే పరిస్థితి ఉందని బాధితులు పేర్కొన్నారు.

భువనగిరి అర్బన్ మే 27 : ఎలాంటి ముందుస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు భువనగిరి పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ పనులు చేపడుతున్నారంటూ బాధితులు, అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. రహదారి విస్తరణతో ఇండ్లు కోల్పోయి తాము వీధిన పడే పరిస్థితి ఉందని బాధితులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు తమకు న్యాయం చేయాలంటూ బుధవారం భువనగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మా ట్లాడుతూ భువనగిరి రహదారిని 30 ఫీట్ల నుంచి 40 ఫీట్ల వరకు విస్తరించాల్సి ఉండగా ఒకేసారి 100 ఫీట్ల విస్తరణ పనులు చేపట్టడంతో రహదారిపై ఉన్న ఇండ్లు కోల్పోయి వీధిన పడే పరిస్థితి వచ్చిందన్నారు.
