అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా మూసీ కుడి కాల్వనే పూడ్చివేశారు. ఈ సంఘటనపై రైతులు ఆందోళన చేపట్టడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మండల పరిధిలోని చెర్కుపల్లిలో కృష్ణ సముద్రం చెర్వు ప్రాంతంలోని ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలించేందుకు అధికారులు కాంట్రాక్టర్కు ఇటీవల అనుమతి ఇచ్చారు

కేతేపల్లి, మే 27 : అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా మూసీ కుడి కాల్వనే పూడ్చివేశారు. ఈ సంఘటనపై రైతులు ఆందోళన చేపట్టడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మండల పరిధిలోని చెర్కుపల్లిలో కృష్ణ సముద్రం చెర్వు ప్రాంతంలోని ప్రభుత్వ భూమి నుంచి మట్టి తరలించేందుకు అధికారులు కాంట్రాక్టర్కు ఇటీవల అనుమతి ఇచ్చారు. సంబంధిత కాంట్రాక్టర్ స్థానిక అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి నిబంధలనకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు మొదలు పెట్టాడని రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ప్రదేశంలో కాకుండా తనకు అనువైన ప్రాంతాన్ని సదరు కాంట్రాక్టర్ ఎన్నుకున్నాడు.
