ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు.

కాటారం, జూన్ 4 : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాలో తన పేరు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా డు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గుండ్రాత్పల్లిలో నిర్వహించిన గ్రామ సభ సమయంలో గు రువారం చోటుచేసుకుంది. అప్రమత్తమైన గ్రా మస్తులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.బాధితుడు నగునూరి శ్రీనివాస్ కథనం ప్రకారం.. గతంలో ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు ఉంద ని, తాజాగా వెల్లడించిన లిస్టులో తొలగించారని అన్నారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్, కార్యదర్శిని అడగగా ‘పై నుంచి వచ్చిన ప్రకారం ఇస్తున్నాం.. మేమేమీ చేయలేం.. దిక్కున్న చోట చెప్పు కొమ్మన్నారని, అయితే మీరు చేసింది అన్యాయం.. నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటే, చేసుకొమ్మని కార్యదర్శి అన్నారు’అని ఆరోపించాడు. ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఒంటి పై పెట్రోల్ పోసుకున్నట్లు తెలిపాడు.
