ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వ ర్షం కురిసింది. మధ్యాహ్నం వాతావరణం చల్లబడి కురిసిన వాన రైతులను ఆగమాగం చేసింది.

వరంగల్;ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా గురువారం సాయంత్రం అకాల వ ర్షం కురిసింది. మధ్యాహ్నం వాతావరణం చల్లబడి కురిసిన వాన రైతులను ఆగమాగం చేసింది. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడగా, మిగతా చోట్ల తేలికపాటి వాన కురిసింది. జనగామ జిల్లాలో ఈదురు గాలులతో వర్షం కురవగా, జనగామ వ్యవసాయ మార్కె ట్, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం పాంనూర్, రంగరాయగూడెం, నర్మెట మండలం వెల్దండ, హన్మంతాపూర్ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగో లు కేంద్రాల్లో కాంటాలైన ధాన్యం బస్తాలు తడిసిపోగా, కుప్పలు పోసిన వడ్లు కొట్టుకుపోయాయి.
