కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో అశ్వారావుపేట, జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.

అశ్వారావుపేట/ జూలూరుపాడు, మే 29 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసరాల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా ఆధ్వర్యంలో అశ్వారావుపేట, జూలూరుపాడు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాస్‌లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గోకినపల్లి ప్రభాకర్, జూలూరుపాడు మండల కార్యదర్శి బానోతు ధర్మా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలపై మోయలేని ఆర్థిక భారం వేస్తున్నారని, సామాన్యులపై పన్నులు, ధరల భారం మోపి కార్పొరేట్ సంస్థలు లాభాలు గడించేలా చేస్తున్నారని మండిపడ్డారు.
