ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా ఉన్నాయి. అన్నదాతల సంక్షేమానికి గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకానికి ప్రస్తుతం సర్కార్ మంగళం పాడుతున్నది. అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో ప్రోత్సహించిన ఉద్యాన పంటల సాగుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరి వేసేలా వ్యవహరిస్తున్నది.

హనుమకొండ సబర్బన్, మే 29 : ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు రైతులను వ్యవసాయానికి దూరం చేసేలా ఉన్నాయి. అన్నదాతల సంక్షేమానికి గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్కో పథకానికి ప్రస్తుతం సర్కార్ మంగళం పాడుతున్నది. అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలతో ప్రోత్సహించిన ఉద్యాన పంటల సాగుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరి వేసేలా వ్యవహరిస్తున్నది. వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల సాగును భారీగా పెంచాలని వేదికలపై ఫోజులు కొడుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఇందుకు అవసరమైన బిందు సేద్యాన్ని బంద్ పెట్టే పనిలో పడ్డారు.
