భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులతోపాటు పలుచోట్ల నష్టం వాటిల్లింది. దమ్మపేట, జూలూరుపాడు, పాల్వంచ తదితర మండలాల్లోని మామిడి, అరటి తోటలు నేలకొరిగాయి

భద్రాద్రి కొత్తగూడెం, మే 29 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులతోపాటు పలుచోట్ల నష్టం వాటిల్లింది. దమ్మపేట, జూలూరుపాడు, పాల్వంచ తదితర మండలాల్లోని మామిడి, అరటి తోటలు నేలకొరిగాయి. అక్కడక్కడా చెట్లు విరిగి రోడ్లకు అడ్డంగా పడిపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. పలువురి ఇంటి రేకులు ధ్వంసమయ్యాయి. ధాన్యం కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తూ ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ సర్కార్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
