మత్స్యశాఖ నిర్లక్ష్య ధోరణితో మత్స్యకారులను చేపపిల్లల కొరత వెంటాడుతొంది. ఉ మ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా చేపపిల్లల ఉత్పత్తి లేకపోవడంతో మత్య్సకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

పాలమూరు, జూన్ 6: మత్స్యశాఖ నిర్లక్ష్య ధోరణితో మత్స్యకారులను చేపపిల్లల కొరత వెంటాడుతొంది. ఉ మ్మడి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులున్నా చేపపిల్లల ఉత్పత్తి లేకపోవడంతో మత్య్సకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చేపపిల్లల పంపిణీ కోసం టెండర్లు పిలిస్తే ఆసక్తి గల కాంట్రాక్టర్లు పాల్గొనకపోవడంతో పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉత్పత్తి కేంద్రాల వద్ద ఏర్పాటుతోపాటు పెంపకానికి ప్రభుత్వం సహకారం అందిస్తు న్నా ఆసక్తి కనిపించడం లేదు. ఫలితంగా మత్య్సకారుల కుటుంబాల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని అమ లుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీఅబాసుపాలవుతోంది.
