ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతో సామాన్య జనం కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్ విలువ ఏకంగా మూడు రెట్లు పెరగడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు మోత మోగనున్నాయి

మర్రిగూడ, జూన్ 8 : ప్రభుత్వం భూముల ధరలు పెంచడంతో సామాన్య జనం కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. మార్కెట్ విలువ ఏకంగా మూడు రెట్లు పెరగడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు మోత మోగనున్నాయి. ప్రభు త్వం ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో భాగంగా భూముల విలువను పెంచి భూములు, ప్లాట్లు కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లింది. ఫలితంగా రియల్ ఎస్టేట్, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రభావం పడనున్నది.
