బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుతో సంస్థాగత నిర్మాణం పటిష్టం చేపట్టాలి నాయకులు, కార్యకర్తలు పార్టీకి అంకితమై సభ్యత్వ నమోదు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

వనపర్తి : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుతో సంస్థాగత నిర్మాణం పటిష్టం చేపట్టాలి నాయకులు, కార్యకర్తలు పార్టీకి అంకితమై సభ్యత్వ నమోదు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం వనపర్తి జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టు యాదవ్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మన వనపర్తిలో 70వేల 500 సభ్యత్వం జరిగింది. సాకులు చెప్పి సభ్యత్వ నమోదులో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. పార్టీ పట్ల విధేయత, చిత్తశుద్ధి, అంకితభావం ఉన్న కార్యకర్తలకు పార్టీ పదవులలో సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.
