కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేసింది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడంతోపాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని గొప్పగా ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేసింది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడంతోపాటు సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని గొప్పగా ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ పెద్దలు.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఇబ్బందిపడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడం కంటే పంటను అమ్ముకోవడానికే ఎక్కువ కష్టాలు పడాల్సివస్తున్నదని రైతులు వాపోతున్నారు.
