ప్రభుత్వ దవాఖానలో నిలిచిన సేవలు.
పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు

సూర్యాపేట: ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని సూర్యాపేట (Suryapet) ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఔట్సోర్సింగ్ సిబ్బంది డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పట్టణంలో బిక్షాటన నిర్వహించారు. జిల్లా కలెక్టర్కు పలుమార్లు తమ సమస్యలు విన్నవించినప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయడంతోపాటు ప్రతి నెల 5వ తేదీ లోపే వేతనాలను చెల్లించాలన్నారు. బిక్షాటన చేసి పూట గడుపుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
