అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోని వివిధ దేశాలపై భారీగా టారిఫ్‌లు విధిస్తున్నారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరమన్నారు. తెలంగాణలో సైతం ఒక ట్రంప్ ఉండే వారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆ తెలంగాణ ట్రంప్‌ను ప్రజలు పక్కన పడేశారంటూ ఎద్దేవా చేశారు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేసే వారు ఎవరైనా ట్రంప్ అవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
