
(శ్రీరామ్ చక్రీ న్యూస్ | 11-05-2027)
మహేశ్వరం నియోజకవర్గంలోని ప్రశాంతి హిల్స్ డివిజన్, నంది హిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సురక్ష చిల్డ్రన్ క్లినిక్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే Sabitha Indra Reddy గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలని, ముఖ్యంగా చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటు ధరల్లో వైద్య సదుపాయాలు కల్పించే ఆసుపత్రులు సమాజానికి ఎంతో అవసరమని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పి. నవీన, అర్కల భూపాల్ రెడ్డి, నర్సిరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కామేష్ రెడ్డి, మదారి రమేష్, విజయ్, సునీత బాలరాజ్, పంతంగి మాధవి, సుర్వి లత, బిందు నిర్మలారెడ్డి, సరితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
