
(శ్రీరామ్ చక్రీ న్యూస్)11/5/2026
మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం కందుకూరు టౌన్లో ఎగిరిశెట్ట నరేశ్, కీర్తి కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి, చిన్నరెడ్డి, పండు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్మార్ట్ ఫైవ్ జిమ్‌ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే Sabitha Indra Reddy గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ, యువత అన్ని రంగాల్లో ముందుండాలంటే శారీరక దృఢత్వం ఎంతో అవసరమని, అందుకోసం వ్యాయామం ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరి భాగంగా ఉండాలని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవన విధానానికి వ్యాయామమే ప్రధాన ఆధారమని, మానవ ఆరోగ్య పరిరక్షణలో ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు.
అలాగే జిమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
