రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.

వికారాబాద్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, సమగ్ర పురోగతికి పునరంకితం అవుదామని పార్టీ శ్రేణులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.
