దండేపల్లి: ‘వాల్టా’ చట్టం ప్రకారం ప్రజలు తమ పొలాల్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచిన టేకు, వేప, తుమ్మ, జిట్రేగి, దిర్శినం, బిల్లుడు తదితర చెట్లను నరికివేయడానికి అటవీ శాఖ అనుమతి తప్పనిసరని తాళ్లపేట అటవీ క్షేత్రాధికారి సుష్మారావు అన్నారు.

ఎవరైనా తాము చెట్లను తొలగించాలంటే వాల్టా చట్టం ప్రకారం ఆన్లైన్ ద్వారా తమ భూమిలో తొలగించబోయే చెట్ల వివరాలు, సంఖ్య, వాటి వయస్సును నమోదు చేయాలని సుష్మారావు చెప్పారు. ‘ఒక్కో చెట్టుకు రూ.500 చొప్పున అటవీ శాఖ పేరుతో డిపాజిట్ చెయాలి. అన్ని అనుమతులు పొందిన తర్వాతే తొలగించిన కలపను ఎక్కడికైనా తరలించుకోవడానికి అవకాశం ఉంటుంది.
