ప్రమాదవశాత్తు ఓ రైతు పొలంలో పడి మృతి చెందాడు.

కోనారావుపేట : ప్రమాదవశాత్తు ఓ రైతు పొలంలో పడి మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావు పేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నేవూరి దేవయ్య (65) బుధవారం తన వ్యవసాయ పొలంలో వారినాట్లు వేసేందుకు మోపెడు వాహనంపై వరి నారును తరలిస్తుండగా పొలం బురదలో పడి మృతి చెందాడు. మృతునికి భార్య అనసూయ, ఇద్దరు కూతుళ్లు కుమారుడు ఉన్నారు. దేవయ్య మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
