రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”* కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మూడవ విడతగా 06, 07, 08, 09, 10, 18, 19, 20, 38, 39, 40 అలాగే 42 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించబడ్డాయి. ప్రజల సమస్యలను

నల్లగొండ, జూన్ 08 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”* కార్యక్రమంలో భాగంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం మూడవ విడతగా 06, 07, 08, 09, 10, 18, 19, 20, 38, 39, 40 అలాగే 42 డివిజన్లలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించబడ్డాయి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వార్డు స్థాయిలోనే పరిష్కార చర్యలు చేపట్టడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యంతో నగరాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడమే ఈ వార్డు సభల ప్రధాన ఉద్దేశ్యమని మున్సిపల్ కమిషనర్ బి.శరత్ చంద్ర తెలిపారు.
