వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న జిల్లా రై తాంగానికి వాణిజ్య పరిశ్రమల మం త్రిత్వ శాఖ ద్వారా తోడ్పాటునందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను కోరారు. సమీకృ త జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ (డీజీఎఫ్టీ), ఏపీఈడీఏ, జాతీయ పసుపు బోర్డు, నాబార్డు, ఇండియా పోస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఎగుమతి ప్రోత్సాహాక కార్యక్రమాన్ని నిర్వహించారు.

నూతన ఎగుమతిదారులను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, జిల్లాల స్థాయిలో ఎగుమతులను గణనీయంగా పెంపొందించటమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ-కామర్స్ ఎగుమతుల ప్రదర్శన, ట్రేడ్ కనెక్ట్ పోర్టల్, పసుపు, వరి, సోయాబిన్, మక్కజొన్న, పత్తి తదితర పంటల మార్కెట్ వైవిద్దీకరణ అంశాలపై డీజీఎఫ్టీ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు.
