జిల్లా కేంద్రానికి ముదిగొండ మండలం కూతవేటు దూరంలో ఉండడం, గ్రానైట్ పరిశ్రమకు నెలవుకావడంతో ఇక్కడి భూములకు మొదటి నుంచి గిరాకీ ఉంది. కొత్తగా జాతీయ రహదారి రావడంతో భూముల రేట్లు అమాంతం పెరగడం వల్ల అక్రమారుల కన్ను ఇటు పడింది. ముదిగొండ మండలంలో రాజకీయ నాయకుడి నుంచి రియల్టర్ అవతారమెత్తిన ఓ అక్రమార్కుడు భూ కబ్జాల పర్వానికి మళ్లీ తెరలేపి తన ఉనికిని చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

ముదిగొండ, మే 26: జిల్లా కేంద్రానికి ముదిగొండ మండలం కూతవేటు దూరంలో ఉండడం, గ్రానైట్ పరిశ్రమకు నెలవుకావడంతో ఇక్కడి భూములకు మొదటి నుంచి గిరాకీ ఉంది. కొత్తగా జాతీయ రహదారి రావడంతో భూముల రేట్లు అమాంతం పెరగడం వల్ల అక్రమారుల కన్ను ఇటు పడింది. ముదిగొండ మండలంలో రాజకీయ నాయకుడి నుంచి రియల్టర్ అవతారమెత్తిన ఓ అక్రమార్కుడు భూ కబ్జాల పర్వానికి మళ్లీ తెరలేపి తన ఉనికిని చాటుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. పూర్తి వివరాల్లోకెళ్తే.. అతనొక పార్టీలో సాధారణ కార్యకర్త. ఏళ్ల తరబడి పార్టీలో ఉండి అవకాశం వచ్చినప్పుడు పలు పదవులు అనుభవించాడు. ఈ క్రమంలో డబ్బు సంపాదనకు భూ ఆక్రమణల మార్గం ఎంచుకున్నాడు.
