ఉద్యమ నాయకుడిని అందించిన గడ్డ సిద్దిపేట అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి అన్నారు.

సిద్దిపేట టౌన, ఏప్రిల్ 7: ఉద్యమ నాయకుడిని అందించిన గడ్డ సిద్దిపేట అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో ‘సిద్దిపేట జిల్లా సాహిత్యం, చరిత్ర, సంస్కృతి’ అనే అంశంపై ఆన్లైన్ జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి హాజరై మాట్లాడారు. సిద్దిపేటకు వేముగంటి నరసింహాచార్యులు, కాపురాజయ్య రెండు కండ్ల వంటివారన్నారు. పల్లె ప్రజలభాష తెలంగాణకు ఆత్మవంటిదన్నారు.
