ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. యేటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో సుమారు 3.50లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు.

మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. యేటా ఖరీఫ్, యాసంగి సీజన్లలో సుమారు 3.50లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2.67 లక్షల మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. యాసంగికి సంబంధించి విడతలవారీగా రెండెకరాలకు మాత్రమే ప్రభుత్వం నిధులు అధించింది. తొలి విడతగా రూ.110 కోట్లు, రెండో విడతగా రూ.56 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
