
మీర్ పేట్, జూన్ 10 (శ్రీరామ్ చక్రి న్యూస్): ఫ్యూచర్ సిటీ బహిరంగ సభకు మీర్ పేట్ లోని నంది హిల్స్ నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీగా బయలుదేరాయి. తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సభకు తరలివెళ్లారు.

ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాలుష్యం లేని పర్యావరణహిత ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో మహేశ్వరం నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయని, యువతకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
