పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సింగరేణి డైరెక్టర్ (పీ & పీ) కె. వెంకటేశ్వర్లు అన్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న హరిత కార్యక్రమాల్లో భాగంగా..

రుద్రంపూర్, జూలై 07 : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సింగరేణి డైరెక్టర్ (పీ & పీ) కె. వెంకటేశ్వర్లు అన్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న హరిత కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కొత్తగూడెం ఏరియాలోని వికెసీఎం ప్రాజెక్టులో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని అందించేందుకు హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు
