కాంగ్రెస్ సర్కారు మెదక్ రైతులపై కక్షకట్టి సింగూరు నీటిని ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేయడం లేదు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ సింగూరు ప్రాజెక్టు నీటిని వ్యవసాయం కోసం ఘనపూర్ ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఘనపూర్ ప్రాజెక్టు నీటితో వేలాది ఎకరాలకు సాగునీరు అందించారు.

ఇసుక తవ్వకాల కోసం అక్రమంగా అటవీ ప్రాంతంలో రోడ్లు వేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. హల్దీవాగులో ఇసుక తవ్వకాలు అరికట్టాలని జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ హల్దీవాగు, మంజీరా నదిపై 14 చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. ప్రస్తుతం విచ్చలవిడిగా చేస్తున్న ఇసుక తవ్వకాలతో చెక్‌డ్యామ్‌లు కూలిపోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఎరువులు సరఫరా చేయడం లేదు. వ్యవసాయరంగానికి 24 గంటలు విద్యుత్ ఇవ్వకుండా కేవలం 13 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నది. ఎన్నికలు ఉంటేనే రైతుభరోసా వేస్తున్నది
