నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోరు రోడ్డు ప్రమాదం జరిగింది. బైపాస్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
