మున్సిపాలిటీ ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్న క్రమంలో పలు చోట్ల ఓట్ల గోల్మాల్ వెలుగులోకి వస్తున్నా యి. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అన్ని బల్దియాలలో ఓటర్ జాబితా ముసాయిదా విడుదల చేసిం ది.

కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు సంబంధించి ఓటరు జాబితా ప్రతులను బహిర్గత పరిచారు. అభ్యంతరాలకు ఈనెల 9వ తేదీ వరకు గడువు విధించారు. ఓటరు ముసాయిదా జాబితా వెలువర్చిన నేపథ్యంలో.. జాబితాలో తప్పులు చూసి ఓటర్లు నివ్వెరబోతున్నారు.
