గ్రామాభివృద్ధిలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యం కల్పిస్తూ గ్రామ సర్పంచ్, పాలకవర్గం సభ్యులు నడుం బిగించారు.

ధర్మసాగర్ : గ్రామాభివృద్ధిలో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యం కల్పిస్తూ గ్రామ సర్పంచ్, పాలకవర్గం సభ్యులు నడుం బిగించారు. ఊరంత చీపురు పట్టి వీధులు, రోడ్లు శుభ్రం చేసి పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో బుధవారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, అధికారులు ఊరంత ఊడ్చి, డ్రైనేజీలను శుభ్రం చేశారు.
