కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పుల్లూరి సాగర్ కు చెందిన 1.20 గుంటల వరి పొలం మంటల్లో కాలి బూడిదైనట్లు బాధితుడు తెలిపాడు.

కాల్వశ్రీరాంపూర్, మే21 : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేటలో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పుల్లూరి సాగర్ కు చెందిన 1.20 గుంటల వరి పొలం మంటల్లో కాలి బూడిదైనట్లు బాధితుడు తెలిపాడు. సాగర్ కు గ్రామ శివారులో ఎకరా 20గుంటల వరి పొలం ఉంది. హార్వెస్టర్లు రాక పొలం కోయలేదు. గురువారం ఉదయం ఓ గ్రామానికి చెందిన హార్వెష్టర్ పొలం కోయడానికి రాగా అప్పటికే మంటల్లో కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.లక్షా యాభైవేల ఆస్థినష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు
