రోహిణీ కార్తె ముందు రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ప్రకృతి సహజ వైపరీత్యం. కానీ, ఈసారి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా తయారైంది.

కోల్ సిటీ, మే 21 : రోహిణీ కార్తె ముందు రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ప్రకృతి సహజ వైపరీత్యం. కానీ, ఈసారి కార్తెకు వారం రోజుల ముందు నుంచే ఎండలు ఉగ్రరూపం దాల్చడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం అగ్నిగుండంగా తయారైంది. ఈ నేపథ్యంలో గురువారం రామగుండంలో ఎండ తీవ్రత ప్రమాద స్థాయిలో ఉందని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హెచ్చరిక జారీ చేసింది. ఈమేరకు పారిశ్రామిక ప్రాంతంలోని పలువురి మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపించడంతో హడలెత్తిపోయారు.
