
“(శ్రీరామ్ చక్రి న్యూస్) 18/03/2026హెల్పింగ్ హ్యాండ్స్” అనే కార్యక్రమం ద్వారా ఇండియన్ పాఠశాల విద్యార్థులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. హోలీ సందర్భంగా దేవరకొండలో జరిగిన బైక్ ప్రమాదంపై పత్రికలో వచ్చిన వార్తను చూసి, ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలుడికి తమ వంతు సహాయం అందించాలని విద్యార్థులు ముందుకు వచ్చారు.
ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆ విద్యార్థులను వెండి పతకాలతో సత్కరించారు. సేవాభావాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, మొత్తం రూ. 8,500/-ను సేకరించి బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ, “విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మేము చేపట్టే ప్రతి కార్యక్రమంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనది” అని తెలిపారు. అందుకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
విద్యార్థులు అందించిన సహాయానికి బాలుడి తల్లిదండ్రులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. “ఈ రోజుల్లో ఆపదలో ఉన్నవారికి సొంతవాళ్లే సహాయం చేయని పరిస్థితుల్లో, మాకు పరిచయం లేని విద్యార్థులు మా బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయం” అని భావోద్వేగంతో చెప్పారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
