
తేదీ:5/3/2026:(శ్రీరామ్ చక్రి న్యూస్) బాలాపూర్ మండలం జిల్లెలగూడలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ నరేన్ దత్త, ప్రిన్సిపాల్ భవాని దత్త ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత కాలంలో ఆధార్ భారతీయుల గుర్తింపుతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు కీలకంగా మారిందని వారు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు మార్చి 7వ తేదీ వరకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆధార్ కేంద్ర నిర్వాహకులు మాట్లాడుతూ, పాఠశాల సమీపంలోని కాలనీలకు చెందిన ప్రజలు ఆధార్‌కు సంబంధించిన బయోమెట్రిక్ నవీకరణలు, కొత్త ఆధార్ కార్డుల నమోదుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు.
ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటుకు సహకరించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ పాఠశాల యాజమాన్యానికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
