ఎవరి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేనే కింగ్ మేకర్. నా నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి.. నా అనుమతి లేకుండా తట్టెడు మట్టి కూడా తీయలేరు.” ఇదీ మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి గతంలో చేసిన వ్యాఖ్యలు. ఇలా ఎవరికి వాళ్లు గొప్పలు చెప్పుకోవడం తప్ప.. తట్టెడు వడ్లు తీసి, రైతుల తిప్పలు పట్టించుకునే పరిస్థితిలో అధికార పార్టీ నాయకులు లేకపోవడం విమర్శలకు తావిస్తున్నది.

చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు సంబంధించించిన పంటను పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని మిల్లలు దించుకునే పరిస్థితి కనిపించడం లేదు. కొనుగోళ్లు మొదలై నెల రోజులు పూర్తికావస్తున్నా ఇప్పటి దాకా పెద్దపల్లి జిల్లా నుంచి ట్యాగింగ్ ఇవ్వాల్సిన మిల్లుల లిస్టు రాలేదు. దీంతో పెద్దపల్లి జిల్లాకు మంచిర్యాల నుంచి పంపాల్సిన 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఏం చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. కరీంనగర్ జిల్లాకు 50 వేల మెట్రిక్ టన్నులు ట్యాగింగ్ ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి దాకా కేవలం 10 వేల మెట్రిక్ టన్నులకే ట్యాగింగ్ వచ్చింది. దీంతో కల్లాల్లో ధాన్యం లిప్ట్ చేశాక.. ఎక్కడికి పంపించాలి,
