పప్పు ఇంత పలచగా ఉంటే విద్యార్థులు ఎలా తింటారని కలెక్టర్ అంకిత్ పాఠశాల హెచ్ఎం, భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం పూర్తి పరిశుభ్రంగా, పోషక విలువలతోపాటు ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఉండాలని స్పష్టం చేశారు.

జూలూరుపాడు, జూన్ 30: పప్పు ఇంత పలచగా ఉంటే విద్యార్థులు ఎలా తింటారని కలెక్టర్ అంకిత్ పాఠశాల హెచ్ఎం, భోజన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం పూర్తి పరిశుభ్రంగా, పోషక విలువలతోపాటు ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం ఉండాలని స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని కేజీబీవీ, జడ్పీ ఉన్నత పాఠశాలలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. కేజీబీవీలో కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులను పరిశీలించారు.
