కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలో జూన్ 8న కందూరి చిన్న మల్లయ్య అనే వ్యక్తి అదృశ్యం కాగా ఆయన మృతదేహం రామారెడ్డి గ్రామ శివారులో మంగళవారం లభ్యమైంది.

రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కందూరి చిన్న మల్లయ్య (80) అనే వృద్ధుడు జూన్ 8న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కాగా కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో జూన్ 12 ఫిర్యాదు చేశారు. కాగా అప్పటి నుండి బంధువులతో పాటు పలు చోట్ల ఎక్కడ వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు.
