సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడ

సంగారెడ్డి, జూన్ 12: జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు బిడ్డలతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన కృష్ణ (32) అనే వ్యక్తికి తన భార్య సవితతో గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ తన ఐదేళ్ల కూతురు అనన్య, ఎనిమిదేళ్ల కుమారుడు రక్షిత్లతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వద్దకు చేరుకుని ఒక్కసారిగా నీటిలోకి దూకేశాడు.
